Sunday, July 29, 2012

మనో బలమా లేక కాల బలమా...



చిగురించిన మనసు విజయం కాలముదా లేక మనసుదా

కూలే కలలసౌద నిర్మాణం ఆపే బలం మనసుదా లేక కాలముదా

మరల రేగే గాయమునకు ప్రత్యేక ఆహ్వానిమ్పే వాంఛ కాలముదా లేక మనసుదా

విడువక వెంటాడే ఆహ్లాద వర్తమానమును హరించే బలం మనసుదా లేక కాలముదా

సుడిగుండాలని అలలుగా చూపించే మాయ కాలముదా లేక మనసుదా

అగ్ని పర్వతాన్ని పుష్పములా నాటే ఊహ మనసుదా లేక కాలముదా

నీవే...


ప్రతి ఊహలో నీ రూపం
ప్రతి పధంలో నీ కధనం
ప్రతి శ్వాసలో నీ పరిమళం
ప్రతి క్షణం నీ ఆలోచనలతో
తెలిసిన బాదే అయిన బరువేక్కే హృదయం
ఎప్పుడు మళ్ళి చూస్తాన అని అలసిన కనులతో...

Followers